భాషా సంస్కృతులు వెల్లివిరిసే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. జీవన వికాసానికీ భాషకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.  భాషకున్న శక్తి  అనంతం, అపారం.

తేనెకన్నా తీయనిది మన తెలుగు భాష. తెలుగు భాషాభివృద్దికి, భాషా పరివ్యాప్తికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా "తెలుగు విజయం" పేరిట భాషా వనరుల కేంద్రాన్నినెలకొల్పింది. భాషా పరిపుష్టితో బాటు భాషా వినియోగాన్ని ప్రోత్సహిండం, అందుబాటులోకి తేవడం ఈ  కేంద్ర ఉద్దేశ్యం.  తెలుగు భాషావనరులను సమీకృతపరిచి, అభివృద్ది పరిచి, నూతనమైనవి రూపొందించి వాటిని ప్రతిఒక్కరికీ అందుబాటులో తేవడం ఈ కేంద్ర  లక్ష్యం.

దశల వారీగా నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలతో ప్రభుత్వం కృషి చేస్తోంది.  తెలుగు విజయంలో భాగస్వామ్యం వహించడానికి తెలుగు వారైన ప్రతి ఒక్కరికీ ఇదే మా సాదర ఆహ్వానం.

రండి .. చేయి చేయి కలిపి పని చేద్దాం. తెలుగు భాషని పరిరక్షించుకుందాం. పదిల పర్చుకుందాం. ముందు తరాల వారికి అందిద్దాం. భాషా వికాసపు వెలుగులో దివ్య భవితని నిర్మించుకుందాం.  

 

 

 

 
 

తెలుగు విశ్వరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్లు )  ఉచిత దిగుమతి

 

 

 
 ముంగిలి    |   గురించి  |   తెలుగు భాష   |     సాంకేతికం   |   వనరులు   |       గుమి   |    సలహా సంఘం   |  సంపర్కం 

 Copyright © 2001-2014 Institute of Electronic Governance

                                                                                                                                                                                                               Site Design by: Agnatech